రణ్వీర్ కుHUSBAND స్టిక్కర్ వేసిన దీపిక పడుకునే


ముంబయి: బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తన భర్త రణ్వీర్సింగ్నుదిటిపై HUSBAND లేబుల్వేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం కరోనావైరస్&విజృంభిస్తోన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్&డౌన్&విధించిన విషయం విధితమే. వృత్తిపరమైన పనులన్నీ నిలిచిపోవడంతో సినీ తారలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఎలాంటి వర్క్ టెన్షన్స్లేకపోవడంతో దీపిక.. ఆమె భర్త రణ్వీర్ముంబయిలోని తమ నివాసంలో చాలా సరదాగా గడుపుతున్నారు. దీంతో దీపిక.. ఇళ్లకే పరిమితమైనప్పుడు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియజేస్తూ ఇన్స్టా వేదికగా కొన్ని ఫొటోలు, వీడియోలను షేర్చేస్తున్నారు.ఇటీవల వంటగదిలో ఉండే సామగ్రిపై లేబుల్స్అతికించడంలాంటి పనులను ఇలాంటి సమయాల్లో చేసుకోవచ్చు అని తెలియజేశారు. ఇదిలా ఉండగా తాజాగా దీపిక.. నిద్రిస్తున్న తన భర్త నుదిటిపై HUSBAND (భర్త) అనే లేబుల్ను అతికించింది. దీనికి సంబంధించిన ఫొటోను సైతం ఆమె ఇన్స్టా వేదికగా షేర్చేసింది. ప్రస్తుతం నెట్టింట్లో ఈ ఫొటో చక్కర్లు కొడుతోంది.


ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘ఛపాక్చిత్రంలో దీపిక నటించారు. యాసిడ్దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రానికి మేఘనా గుల్జర్ దర్శకత్వం వహించారు. దీపిక-రణ్వీర్ కలిసి ‘83’ చిత్రంలో నటించారు. భారత క్రికెటర్కపిల్;దేవ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రమిది. కరోనా వైరస్కారణంగా ఏప్రిల్లో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని కొంతకాలంపాటు వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Comments