బెంగళూరు : మీరు కరోనా వైరస్ పరీక్ష చేయించు కోవాలనుకుంటున్నారా? అయితే కొత్తగా కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ప్రాక్టో వైద్యపరీక్షల సంస్థ కరోనా డిటెక్షన్ పరీక్షలు చేసేందుకు ముందుకు వచ్చింది. భారత ప్రభుత్వం మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ఆమోదంతో బెంగళూరుకు చెందిన ప్రాక్టో సంస్థ కరోనా డిటెక్షన్ పరీక్షలు చేసేందుకు వీలుగా థైరో కేర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. వైద్యుడి ప్రిస్క్రిప్షన్, వైద్యుడు సంతకం చేసిన టెస్ట్ రిక్విజిషన్ ఫారం, వ్యక్తి ఫొటో ఐడి కార్డును సమర్పిస్తే 4,500 రూపాయల బిల్లుతో కరోనా వైరస్ పరీక్ష చేయించుకోవచ్చు.
ఇప్పటికే ముంబై నగరంలో అందుబాటులోకి వచ్చిన ఈ సేవలు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తామని ప్రాక్టో అధికారి వెల్లడించారు. కరోనా పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే ఐ2 హెచ్ నుంచి సర్టిఫైడ్ ఫైబోటోమిస్టులు రోగుల ఇళ్లకు వచ్చి నమూనాలను సేకరించి వాటిని థైరోకేర్ ప్రయోగశాలలో పరీక్షల కోసం తరలిస్తారు. రోగి నమూనా సేకరణ జరిగిన 24-48 గంటలలోపు ప్రాక్టో వెబ్‌సైట్‌లో పరీక్షల నివేదిక రోగులకు అందుబాటులో ఉంచుతామని ప్రాక్టో చీఫ్ హెల్త్ స్ట్రాటజీ ఆఫీసర్ డాక్టర్ అలెగ్జాండర్ కురువిల్లా చెప్పారు. కరోనా ప్రబలుతున్న క్లిష్టసమయాల్లో ప్రజలకు కరోనా పరీక్షలు అందుబాటులో ఉంచేందుకు తాము కట్టుబడి ఉన్నామని డాక్టర్ అలెగ్జాండర్ వివరించారు
Comments
Post a Comment