బోర్డు అనుమతిస్తేనే సేవలు
ఉన్నతాధికారులతో చర్చించిన మంత్రి గోయల్
న్యూఢిల్లీ, ఏప్రిల్: లాక్‌డౌన్ ముగిసిన వెంటనే రైళ్ల పునఃప్రారంభానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈనెల 14న లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత 15వ తేదీ నుంచి రైళ్లు నడుస్తాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ శనివారం వివరణ ఇచ్చింది. ప్యాసింజర్ రైళ్ల పునఃప్రారంభానికి రైల్వే జోన్లు ఏర్పాట్లు చేస్తున్నాయంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. రైల్వే బోర్డు చైర్మన్, ఇతర ఉన్నతాధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం జరిపిన రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని అధికారులు తెలిపారు. దశలవారీగా రైల్వే సేవలను ప్రారంభించాలనీ, దానికి సంబంధించిన ప్రణాళికను రైల్వే జోన్లు అనుమతి కోసం బోర్డుకు పంపాల్సి ఉంటుందని ఈ సమావేశంలో నిర్ణయించారని వారు చెప్పారు.
Comments
Post a Comment