డోంట్‌వర్రీ.. డోర్ డెలివరీ.. మందు బాబులకు మంచి వార్తా ..!


రాయల్‌స్టాగ్ ఫుల్ రూ.3500, బ్లైండర్స్ ప్రైండ్ రూ.4000, బీరు రూ.400  మాకు మంచిదే అంటున్న ఎక్స్ఛేంజి శాఖ .

                       ప్రజలకు అవసరమయ్యే నిత్యావసర సరుకులను, మందుల డోర్‌ డెలివరీకి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయగా, మద్యం విక్రేతలు కూడా తమకు తాముగా మద్యం బాటిళ్లను యథేచ్ఛగా డోర్‌ డెలివరీ చేస్తున్నారు. పైగా డోర్‌ డెలివరీ చేస్తున్న మద్యం బాటిళ్ల ధరలు చూస్తే ఎవరికైనా కళ్లు చెదరక తప్పదు. అయినా మద్యం ప్రియులు అలవాటు మానుకోలేక కొనుగోలు చేస్తూ, రోజు తీసుకునే మోతాదును తగ్గించుకుంటున్నారు. రాష్ట్రమంతటా లాక్‌డౌన్‌ ప్రకటించిన రెండు మూడు రోజుల తర్వాత వైన్‌షాపులను మూసివేస్తూ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికే జిల్లాలోని వైన్‌షాపులలో మద్యం నిల్వలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. ప్రభుత్వం మూసివేత నిర్ణయం తీసుకోవడంతో వైన్‌షాపు నిర్వాహకులు ఎలాగోలా ఆయా మద్యం బాటిళ్ల విక్రయానికి తెరలేపారు. కొందరు ఏజెంట్లను నియమించుకున్న నిర్వాహకులు ఫోన్‌లో అడగ్గానే గుట్టుచప్పుడు కాకుండా బాటిళ్లను ఇళ్లకు చేరవేస్తున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డితో పాటు సదాశివపేట, పటాన్‌చెరు, జహీరాబాద్‌, జోగిపేట ప్రాంతాలలో సాగుతున్నట్టు తెలుస్తున్నది. 


కర్నాటక నుంచి చీఫ్‌ లిక్కర్‌
                       కర్నాటక నుంచి చీఫ్‌ లిక్కర్‌ను తెచ్చి విక్రయిస్తున్నట్టు తెలుస్తున్నది. బీదర్‌ నుంచి జిల్లాలోకి డప్పుర్‌, చాల్కి, మోరిగ, కర్‌సగుత్తిలతో పాటు మరోవైపు మొగుడంపల్లి మీదుగా కూడా వచ్చే మార్గాలున్నాయి. చెక్‌ పోస్టులున్నా పోలీసుల కళ్లు గప్పి రహస్యంగా చీఫ్‌ లిక్కర్‌ను జిల్లాలోకి చేరవేస్తునానరు. బీదర్‌ నుంచి ఆయా మార్గాల ద్వారా జిల్లాకు వస్తున్న చీఫ్‌ లిక్కర్‌ వట్‌పల్లి మీదుగా ఇంటర్నల్‌ రోడ్ల నుంచి జోగిపేట, పుల్కల్‌ మండలాల నుంచి సంగారెడ్డి, సదాశివపేట చుట్టు పక్కల ప్రాంతాలకు సరఫరా అవుతున్నట్టు తెలుస్తున్నది. మద్యం బాటిళ్లు డోర్‌ డెలివరీ అవుతున్నా, చీఫ్‌ లిక్కర్‌ విచ్చలవిడిగా విక్రయస్తున్నా ఎక్సైజ్‌ శాఖ అధికారులు దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. 











Comments