దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. తాజాగా కరోనా కేసుల సంఖ్య 3,374కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం వెల్లడించింది. అలాగే ఇప్పటి వరకు 77 మంది మరణించినట్లు తెలిపింది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయానికి 306 కేసులు నమోదైనట్లు సమాచారం. మొత్తంగా గత 24 గంటల్లో 472 మంది కొత్త వారిలో వైరస్ గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 266 మంది వైరస్ నుంచి కోలుకొని ఇళ్లకు చేరుకోగా.. 3,030 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు మహారాష్ట్రలో అత్యధికంగా 24 మంది మరణించగా.. గుజరాత్ 10, తెలంగాణలో ఏడుగురు, పంజాబ్‌లో ఐదుగురు, మధ్యప్రదేశ్, దిల్లీలో ఆరుగురు చొప్పున మృత్యువాతపడ్డారు. ఇక కేసుల విషయానికి వస్తే అత్యధికంగా మహారాష్ట్రలో 490, తమిళనాడులో 485, కేరళలో 306 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 269, ఉత్తర్‌ప్రదేశ్‌లో 227 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు.
ఇండోర్ నగరంలో కొత్తగా 10 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. ఇక రాజస్థాన్‌లో కొత్తగా మరో ఆరు కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 201కి చేరినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. లఖ్‌నవూ కంటోన్మెంట్ ప్రాంతాన్ని 48 గంటలపాటు పూర్తిగా బంద్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. దిల్లీలోని జమాత్ నుంచి ఈ ప్రాంతానికి తిరిగొచ్చిన 12 మందిలో వైరస్ ఉన్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన ముగ్గురు జనాన్లు ఇంటికే పరిమితమైనట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఒకరు తబ్లిగీ జరుగుతున్న సమయంలో దిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతాన్ని సందర్శించినట్లు తెలిసింది. ఇక సీఆర్‌పీఎఫ్‌కు చెందిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ మినహా మిగతా ఎవరికీ వైరస్ సోకలేదని అధికారులు స్పష్టం చేశారు.

Comments
Post a Comment