బ్రేకింగ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో మరో 21 కరోనా పాజిటివ్ కేసులు!


 అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గురువారం నాడు మరో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో 132కు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య చేరింది. కేవలం 12 గంటల వ్యవధిలో మరో 21కొత్త కేసుల నమోదు కావడం గమనార్హం. 

జిల్లాల వారీగా కరోనా పాజిటివ్‌ కేసులు..:-
గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 20 చొప్పున కేసులు
ప్రకాశం : 17
కడప, కృష్ణా జిల్లాల్లో 15 కేసులు
పశ్చిమ గోదావరి : 14
విశాఖపట్నం : 11
తూర్పుగోదావరి : 09
చిత్తూరు : 08
అనంతపురం: 02
కర్నూలు : 01 

గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకూ అత్యధికంగా 20 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇంతవరకూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

Comments