మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనున్న Realme.. ఈసారి టార్గెట్ యూతే!

రియల్‌మీ తన కొత్త నార్జో సిరీస్‌ను ఒక రోజు క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సిరీస్ లో నార్జో 10, నార్జో 10ఏ ఫోన్‌లను మార్చి 26వ తేదీన భారతదేశంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త సిరీస్ యువతను లక్ష్యంగా చేసుకుంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్ల గురించి మరింత సమాచారాన్ని తెలపడానికి ప్రత్యేక పేజీని రూపొందించింది. రియల్‌మీ నార్జో 10 వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. రియల్‌మీ నార్జో 10ఏలో ట్రిపుల్ కెమెరా సెటప్ ను అందించారు. ఈ రెండు ఫోన్లు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీలను అందించనున్నాయి. 

మార్చి 26వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు భారతదేశంలో రియల్‌మీ నార్జో 10, రియల్‌మీ నార్జో 10ఏ ఫోన్‌లను లాంచ్ చేయనుంది. లాంచ్ సమాచారాన్ని రియల్‌మీ తన ప్రత్యేక పేజీలో అప్ డేట్ చేసింది. రెండు ఫోన్‌ల రెండర్‌లు, కీలక స్పెసిఫికేషన్‌లను కూడా తెలిపింది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు, రెండు ఫోన్లు 6.5 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో రానున్నాయి. 89.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో ఉన్న స్క్రీన్లు వీటిలో అందించనున్నారు. వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌లో ఫ్రంట్ కెమెరాను కలిగి ఉన్నాయి. రాబోయే రోజుల్లో రియల్‌మీ రెండు ఫోన్‌ల గురించి మరింత సమాచారం విడుదల చేసే అవకాశం ఉంది. 

రివీల్ చేసిన స్పెసిఫికేషన్లు, రెండర్‌ల ప్రకారం చూస్తే, రియల్‌మీ నార్జో 10.. రియల్‌మీ 6i రీబ్రాండెడ్ వెర్షన్‌గా కనిపిస్తుంది. రియల్‌మీ 6ఐ కొన్ని రోజుల క్రితం మయన్మార్‌లో లాంచ్ అయింది. ఈ మోడల్‌లో క్వాడ్ కెమెరా సెటప్ మరియు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఫోన్ డిజైన్, దాని వెనుక కెమెరా ప్లేస్‌మెంట్‌లు కూడా ఒకేలా ఉన్నాయి.

Comments