Nokia మొదటి 5జీ ఫోన్ లాంచ్.. అదిరిపోయే ఫీచర్లు.. మరి ధర ఎంతంటే?

నోకియా తన మొదటి 5జీ ఫోన్ నోకియా 8.3 5జీని ఎట్టకేలకు లాంచ్ చేసింది. ఇప్పటికే ప్రముఖ బ్రాండ్లన్నీ 5జీపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఒప్పో, రియల్ మీ, ఐకూ, హువావే, షియోమీ వంటి బ్రాండ్లు ఇప్పటికే 5జీ ఫోన్లను తీసుకువచ్చాయి కూడా. అయితే నోకియా లాంచ్ చేసిన ఈ ఫోన్ పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. నోకియా మొదటి సారి 5జీ టెక్నాలజీతో ఈ ఫోన్ ను లాంచ్ చేయడమే దీనికి కారణం. అయితే ఆ అంచనాలను ఈ ఫోన్ అందుకుందా? దీని ధర ఎంత? ఇందులో ఉన్న స్పెసిఫికేషన్లేంటి? ఇతర బ్రాండ్లు లాంచ్ చేసిన 5జీ స్మార్ట్ ఫోన్ల నుంచి వచ్చే పోటీని ఇది తట్టుకోగలదా? వంటి విషయాలను తెలుసుకోవడానికి కథనాన్ని పూర్తిగా చదవండి! 
నోకియా 8.3 5జీలో మొత్తం రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 599 యూరోలుగానూ(సుమారు రూ.48,100), 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 649 యూరోలుగానూ(రూ.52,100) నిర్ణయించారు. కేవలం పోలార్ నైట్ ఒక్క రంగులో మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ వేసవిలో ఈ ఫోన్ అమ్మకానికి రానుంది. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయంపై ఇంకా ఎటువంటి స్పష్టతా లేదు 
నోకియా 5.3 స్మార్ట్ ఫోన్ లో 6.81 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ప్యూర్ డిస్ ప్లే ప్యానెల్ ను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ పిక్సెల్ రిజల్యూషన్ 1080x2400 పిక్సెల్స్ గా ఉంది. ఇందులో 64 జీబీ, 128 జీబీ రెండు వేరియంట్లు అందుబాటులో ఉంది. ఎక్స్ పాండబుల్ స్టోరేజ్(మైక్రో ఎస్ డీ కార్డు) ద్వారా దీన్ని 400 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765G ప్రాసెసర్ పై పని చేయనుంది.

Comments