Coronavirus : కరోనాపై గుడ్ న్యూస్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం....

Coronavirus | Covid 19 : భారత దేశం కరోనా వైరస్ను కట్టడి చెయ్యగలదా అన్న ప్రశ్నకు ప్రస్తుతానికి చెయ్యగలదు అన్న సమాధానం వస్తోంది. కారణం... కేంద్రం తాజాగా తీసుకున్న చర్యల వల్ల శనివారం దేశంలో కొత్తగా 2 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. అంతేకాదు... ఏడుగురికి కరోనా పూర్తిగా తగ్గిపోయింది. వాళ్లను శనివారం ఆస్పత్రుల నుంచీ డిశ్చార్జి చేశారు. వాళ్లలో ఉత్తరప్రదేశ్ నుంచి ఐదుగురు, రాజస్థాన్ నుంచి ఒకరు, ఢిల్లీ నుంచి ఒకరు ఉన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 84గా ఉన్నాయి. ఐతే... ఈ 84 మందితో దగ్గరగా ఉన్న మరో 4000 మందిని కేంద్రం ప్రత్యేకంగా ఉంచి వైద్య పరీక్షలు జరిపిస్తోంది. ఇప్పటివరకూ కరోనా వైరస్ సోకి...

ఇద్దరు చనిపోవడంతో... ఆ ఇద్దరి కుటుంబాలకూ కేంద్రం రూ.4 లక్షల పరిహారం ప్రకటించింది. ఇకపై కరోనా వైరస్ వల్ల రోగులకు ఎలాంటి ట్రీట్మెంట్ చేసినా ఆ మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.

ఇక కరోనా కట్టడికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటనను సార్క్ దేశాలు స్వాగతించాయి. మన పక్క దేశం పాకిస్థాన్ కూడా సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... సార్క్ దేశాల అధినేతలతో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడతారు. ఆ దేశాలు ఏయే చర్యలు తీసుకుంటున్నాయో తెలుసుకుంటారు. ఇండియా ఏం చేస్తోందో వివరిస్తారు. ఇప్పుడు సార్క్ లోని 8 సభ్య దేశాలైన భారత్, పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు కలసికట్టుగా కరోనా అంతు చూస్తాయి. ఐతే... ఈ అన్ని దేశాల్లో కరోనా ఉంది. కాబట్టి ఈ దేశాలన్నీ భారత్ లాంటి పెద్ద దేశం సహకారాన్ని కోరుకుంటున్నాయి. మోదీ వీడియో కాన్ఫరెన్స్ పాకిస్థాన్ కూడా పాల్గొనబోతోంది. ఇది రెండు దేశాల మధ్యా స్నేహ బంధాన్ని పటిష్ట పరుస్తుంది.

Comments