
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం `ఆచార్య`. ఈ సినిమాలో మరో కీలక పాత్ర కూడా ఉందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఆ పాత్రలో మహేష్ నటిస్తాడని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే చివరకు రామ్‌చరణ్‌నే ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో చెర్రీ పాత్ర షాకింగ్‌గా ఉండబోతోందట.
నక్సలైట్ పాత్రలో చెర్రీ కనిపించబోతున్నాడట. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఈ పాత్ర సినిమాను మలుపు తిప్పుతుందట. ఈ పాత్ర స్ఫూర్తితోనే ఆచార్య తన గమ్యాన్ని ఏర్పరచుకుంటాడట. సినిమాలో దాదాపు 30 నిమిషాలపాటు చెర్రీ క్యారెక్టర్ ఉంటుందట. చెర్రీ కోసం ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా కొరటాల ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా చిరంజీవి, రామ్‌చరణ్ మీద ఓ పాటను కూడా చిత్రీకరించబోతున్నారట.
Comments
Post a Comment