తోపుడు బండ్ల ద్వారా.. ఇళ్ల వద్దకే సరుకులు

ఆంధ్రప్రదేశ్‌లో తోపుడు బండ్ల ద్వారా.. ఇళ్ల వద్దకే సరుకులను పంపిస్తామని ముఖ్యమంత్రి అదనపు చీఫ్ సెక్రటరీ డాక్టర్ పీవీ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వల్ల ఆందోళన వద్దని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం...                    
 ఆంధ్రప్రదేశ్‌లో తోపుడు బండ్ల ద్వారా.. ఇళ్ల వద్దకే సరుకులను పంపిస్తామని ముఖ్యమంత్రి అదనపు చీఫ్ సెక్రటరీ డాక్టర్ పీవీ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వల్ల ఆందోళన వద్దని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దాన్ని జయించవచ్చన్నారు. అలాగే వైద్య సేవలు అందించేందుకు రిటైర్ అయిన డాక్టర్లు, నర్సుల వివరాలు సేకరిస్తున్నామన్నారు. అలాగే ప్రజలు తప్పకుండా స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. నిత్యవసర వస్తువుల దుకాణాలను రోజంతా తెరిచి ఉంచే ఆలోచన కూడా ఉందని ఆయన అన్నారు.
తోపుడు బళ్ల ద్వారా ఇళ్ల వద్దకే నిత్యవసర వస్తువులను తెచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు. కాగా స్వీయ నియంత్రణ పాటిస్తున్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా, రవాణా విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే పారాసిట్ మాల్-650 ఎంజీ వేసుకోవచ్చు కానీ.. యాస్ప్రిన్ వేసుకోవద్దని పీవీ రమేష్ సూచించారు. అలాగే.. డాక్టర్ల సూచనలు లేకుండా అమెరికాలో హైడ్రో క్లోరిక్విన్ వినియోగించి.. ఓ దంపతులు చనిపోయిన సంఘటనలు ఉన్నాయని.. కాబట్టి.. ఏ మందులు పడితే అవి వేసుకోవద్దని ఆయన చెప్పారు. అలాగే ప్రతీ కుటుంబానికి బియ్యంతో పాటు వెయ్యి రూపాయలని అందిస్తామని ముఖ్యమంత్రి అదనపు చీఫ్ సెక్రటరీ డాక్టర్ పీవీ రమేష్ పేర్కొన్నారు.
Daily Nececities to Serve Directly to homes in AP, తోపుడు బండ్ల ద్వారా.. ఇళ్ల వద్దకే సరుకులు

Comments