కర్నూలు: రైతు బజార్లో అధికారుల దాడులు

కర్నూలు: నగరంలోని సి. క్యాంప్ రైతు బజార్లో మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారుల దాడులు జరిపారు. అధిక రేట్లకు కూరగాయలు అమ్ముతున్న రెండు దుకాణాలు సీజ్ చేశారు. మార్కెట్ అధికారులు నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువ ధరలకు కూరగాయలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్‌విఈవో తిరుమలేశ్ రెడ్డి హెచ్చరించారు. 

Comments