ఏటీఎం విత్‌డ్రాలపై కేంద్రం గుడ్‌న్యూస్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పాటించాలని ఆదేశించిన కేంద్రం క్యాష్ విత్‌డ్రాలపై ఆంక్షలను సడలించింది. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదును విత్‌డ్రా చేసినా ఎటువంటి చార్జీలు ఉండబోవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. మూడు నెలల వరకూ ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని ఆమె తెలిపారు. 

బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వ పరిమితిని కూడా ఎత్తేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ నిర్ణయంతో లాక్‌డౌన్‌ను పాటించే ప్రజలకు కొంత ఊరటనిచ్చినట్టయింది. ఈ సడలింపుతో కనీస నగదు నిల్వను కూడా దైనందిన ఖర్చులకు వినియోగించుకునే అవకాశం ప్రజలకు లభించింది.

Comments