చైనాలో మరో వైరస్&పేరేంటో తెలుసా?

ముంబయి: ప్రపంచమంతా కరోనా వైరస్&ను ఎలా కట్టడి చేయాలా&అని బాధపడుతోంది. దేశాలన్నీక్రమంగా లాక్డౌన్&అవుతున్నాయి. మూడో దశలోకి చేరితే పరిస్థితేంటా అని భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చైనాలో మరో వైరస్తో ఓ వ్యక్తి మృతిచెందడం అందరినీ కలవపరుస్తోంది. ఆ వైరస్కు టీకామందు ఉండటం ఊరట కలిగించే అంశం.

చైనాలోని యున్నన్ ప్రావిన్స్లో ఓ వ్యక్తి హంటా వైరస్తో మృతిచెందాడు. ఈ విషయాన్ని ఆ ప్రభుత్వ మీడియా సంస్థ ‘గ్లోబల్టైమ్స్ట్విటర్ద్వారా తెలియజేసింది. సోమవారం షాండోగ్ప్రావిన్స్లో బస్సులో ప్రయాణిస్తుండగా అతడు చనిపోవడం గమనార్హం. ఈ వైరస్లక్షణాలు సైతం ఫ్లూ, కరోనాని పోలివుండటం గమనార్హం.

లక్షణాలు :
>హెచ్&పీఎస్ముందు అలసట, జ్వరం, కండరాల నొప్పి (మరీ ముఖ్యంగా తొడలు, పిరుదులు, కొన్నిసార్లు భుజాల్లో), తలనొప్పి, బద్దకం, తిమ్మిర్లు, ఉదర ఇబ్బందులు ఉంటాయి. పది రోజుల తర్వాత దగ్గు, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడటం.

ఒకటి నుంచి రెండు వారాల్లోనే లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఎనిమిది వారాల వరకు కనిపించవు. మొదట తలనొప్పి, వెన్ను నొప్పి, కడుపు నొప్పి, జ్వరం, తిమ్మిర్లు, చూపు తగ్గడం ఉంటాయి. తర్వాత రక్తపోటు, మూత్రపిండాల వైఫల్యం కనిపిస్తుంది.

Comments