లాక్‌ డౌన్ టైమ్‌లో ఆల్కహాల్ తీసుకుంటున్నారా..

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత దేశం మొత్తం లాక్ డౌన్ దిశగా పయనిస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని పలు దేశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి.ప్రపంచంలోని వంద కోట్ల మంది పూర్తిగా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇండియాలో ఈ మహమ్మారి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్‌ గా చర్యలు తీసుకుంటుంది. దీంతో ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితవుతున్నారు. కరోనా భయం వెంటాడుతున్న నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు లాక్‌ డౌన్‌ను ప్రకటించాయి. చైనాలో వుహాన్‌లో పుట్టిన కరోనా రోజురోజుకి విస్తరిస్తోంది. అక్కడ మొదట లాక్‌ డౌన్‌ విధించారు. ఆ తర్వాత పలు దేశాల్లోనూ లాక్‌ డౌన్‌ అమలవుతుంది. కొన్ని దేశాల్లో ఈ మధ్య లాక్‌ డౌన్‌ ఎత్తి వేయగా మన ఇండియాలో మాత్రం లాక్‌ డౌన్‌ అమలులోకి వచ్చింది. దీంతో ప్రజలు కొంత భయాందోళనకు గురవుతున్నారు 

గత కొన్ని వారాలుగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఒక ఉత్తేజకరమైన హాలీవుడ్ మూవీ కాన్సెప్ట్‌లా ఉంది. అయితే ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నది నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నప్పటికీ.. ఇది నిజం. ఒకప్పుడు సినిమాల్లో ఇలాంటి వైరస్‌ల బారిన పడి నగరమంతా నిర్మానుష్యంగా అవ్వడాన్ని చూశాం. కానీ ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా నిజ జీవితంలోనూ అనుభవిస్తున్నాం. ఈ విషయంలో మనమందరం ఉత్సాహంగా, భయపడినట్లు అనిపిస్తుంది. కానీ ఏదేమైనా చివరికి ఈ చారిత్రక సమయాన్ని ఎదుర్కోవటానికి అంతా సిద్ధంగానే ఉన్నారు. . గొప్ప ఆలోచనలు పంచుకోవడం ద్వారా లాక్‌డౌన్ ఒకరికొకరు మంచి స్థితిగా మార్చడంలో మనమందరం ఒకరికొకరు సాయం చేసుకునేలా ఆలోచిస్తున్నాం. అయితే ఇలాంటి సమయంలో ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Comments