
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రానికి ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి అపూర్వమైన ఆదరణ దక్కుతుంది. మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందనను తెలియజేస్తూ ‘‘మోషన్ పోస్టర్ కనువిందుగా ఉంది. నా ఒళ్లు గగుర్పొడిచింది. కీరవాణి అద్భుతమై సంగీతాన్ని, నేపథ్య సంగీతాన్ని అందించారు. రాజమౌళి, చరణ్, తారక్ పనితీరు అద్భుతంగా ఉంది. ఈ ఉగాది రోజున అందరిలో ఎనర్జీని నింపారు’’ అన్నారు. చిరు మెసేజ్‌కు ‘‘సర్.. మీరు ప్రశంసించడం ఆనందంగా ఉంది. ఉగాది శుభాకాంక్షలు. ట్విట్టర్‌కు స్వాగతం’’ అని రాజమౌళి రిప్లై ఇచ్చారు.
Comments
Post a Comment