టీవీ వీక్షకులకు శుభవార్త. మార్చి 1 నుంచే ట్రాయ్ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం.. రూ.130 కే 200 ఉచిత ఛానళ్లు అందుబాటులో వచ్చాయి. రూ.160 కే అపరిమిత ఉచిత ఛానళ్లు వీక్షించవచ్చు. 26 డీడీ ఛానళ్లు వీటికి అదనం. వీక్షకులకు నచ్చిన ఛానల్ను అడిగి మరీ పెట్టించుకోవచ్చు, నచ్చిన ఛానళ్లను మాత్రమే చూడవచ్చు. ఈ నిబంధనల ప్రకారం.. వినియోగదారుడు ఎంచుకున్న ఛానళ్లన్నింటినీ ఎంఎస్;వోలు, లోకల్ కేబుల్ ఆపరేటర్లు ఇవ్వాల్సిందే. సవరించిన ధరలను డీపీవో వెబ్;సైట్లో ఉంచాల్సిందే. వీక్షకులు అడిగిన ఛానళ్లను ఇవ్వకపోతే ట్రాయ్కు నేరుగా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించారు.
Comments
Post a Comment