జగన్‌ సర్కార్‌కు పెద్ద సమస్యే వచ్చి పడిందే.. బయటపడేదెలా?


కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పాజిటివ్ కేసులు మెల్లిగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం వైరస్ కట్టడి చేసే పనిలో ఉంది. ఆ మహమ్మారిని అరికట్టేందుకు లాక్‌డౌన్ ప్రకటించారు. ఈ నెల 31 వరకు అప్రకటిత కర్ఫ్యూ కనిపించనుంది. ప్రజలెవరూ బయటకు రావొద్దని నిత్యావసర వస్తువుల కోసం కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. జనాలెవరూ గుంపులుగా ఉండొద్దని హెచ్చరిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను కూడా అనుమతించడం లేదు. అత్యవసరమైన వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. రోడ్డుపై ఎవరైనా కనిపిస్తే కేసులు బుక్ చేసే పనిలో ఉన్నారు. ఒక వైపు కరోనా వైరస్ ప్రభావం తో యావత్ భారత దేశం వణికిపోతూ అన్ని రకాల సమావేశాలను రద్దు చేస్తన్నారు. లోక్‌సభ కూడా వాయిదా పడింది. కానీ ఇదే సమయంలో జగన్ సర్కార్‌కు అసెంబ్లీ సమావేశాల రూపంలో పెద్ద సమస్యే వచ్చి పడింది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా.. నిజమే పరిస్థితి అలాంటిది మరి.

అసెంబ్లీ సమావేశాలు తప్పనిసరి 

 
ఏపీలో అసెంబ్లీ సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్ ఈ నెల 31 వరకు ప్రకటించినా బడ్జెట్ సెషన్స్ నిర్వహించక తప్పేలా లేదు. దీని వెనుక ఆసక్తికరమైన కారణం ఉంది.. మార్చి 31 నాటికి వచ్చే ఆర్ధిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ని ఆమోదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 31లోగా రాష్ట్ర ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ ఆమోదించకపోతే ఏప్రిల్ ఒకటి నుంచి.. రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా వినియోగించలేని పరిస్థితి ఎదురవుతుంది. దీన్ని అధిగమించాలంటే మార్చి 31లోగా రాష్ట్ర శాసనసభ, మండలిలో రాష్ట్ర వార్షిక ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే తిప్పి కొడితే మరో వారం రోజులు ఉన్నాయన మాట.

ఈ నెల 27 నుంచి సమావేశాలు ప్రారంభమయ్యే ఛాన్స్!

Comments