ఎక్స్ పోజింగ్ లో సిమ్రాన్ స్టయిలే వేరు?


సిమ్రాన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని హీరోయిన్‌. టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నటి. నైన్‌టీస్‌లో తన ఒంపుసొంపులతో ఈ భామ టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపిందనే చెప్పాలి. ఒకప్పుడు సిమ్రాన్ మాంచి ఫిజిక్ మెయింటెయిన్ చేసేది. తన హైట్‌కి తగ్గట్టు పర్సనాలిటీని కూడా మెయిన్‌టెయిన్ చేసేది. ఈమె ఎక్స్‌పోజింగ్ మాములుగా చెయ్యలేదు. ఇక ఈమె బొడ్డకింద చీర కట్టిందంటే చాలు కుర్రాళ్ళు కళ్ళు తిప్పుకోలేకపోయేవారంటే అతిశయోక్తి లేదు. అయితే ఈమె అవసరం మేరకు కొన్ని సినిమాల్లో ఆమె కొన్ని క్యారెక్టర్స్ కోసం ఎక్స్ పోజింగ్ చెయ్యక తప్పలేదు. అలాంటప్పుడు ఆమె ప్రదర్శించే ఒంపుసొంపులు అదరహో అనేలా ఉంటుంది.
ఇక ఆమె నటించిన పాత్రలన్నీ కూడా చాలా అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించింది. ఇక స్టార్టింగ్ కొన్ని చిత్రాల్లో మాత్రం ఎక్స్‌పోజ్ చేసింది తప్పించి దాదాపు ఆ తర్వాత చిత్రాల్లో ఈమె పాత్రకు ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించింది. వాటిల్లో ఎక్కువగా హోమ్‌లీగానే కనిపించేది. అయితే చాలా సినిమాల్లో ఈమె నడుముని ఎక్స్‌పోజ్ చేసేది. ఎవరైనా ఒక అమ్మాయిని పోల్చాలంటే సిమ్రాన్ నడుము అనేవాళ్ళు అంతలాగా ఆమె ఎక్స్‌పోజ్ చేసేది. ఇక కొద్ది కాలం తర్వాత ఆమె వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టినప్పటికీ ఆశించినంత పెద్దగా చిత్రాల్లో అవకాశాలు ఆమెకు రాలేదు.


ఇటీవలె కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రజినీ హీరోగా తెరకెక్కనున్నచిత్రంలో రజినీ సరసన హీరోయిన్‌గా సిమ్రాన్‌ నటించనున్నారని కోలీవుడ్ వర్గాలు వినిపించాయి. అయితే ముందు ఈ సినిమాలో తలైవాకి జోడీగా తొలుత త్రిష, మీనా అనుకున్నారట. కానీ ఆ ఛాన్స్‌ సిమ్రాన్‌ని వరించినట్లు సమాచారం. తెలుగులో ఈమె నటించిన చివరి చిత్రం 'జాన్‌ అప్పారావ్‌ 40 ప్లస్‌'. 2008లో విడుదలైన ఈ సినిమాలో కమెడియన్ కృష్ణభగవాన్ హీరోగా నటించారు.

Comments