
దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా... యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. వీరి సరసన అలియాభట్, ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. 2021, జనవరి 8న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లాక్ డౌన్ సందర్భంగా ఈ చిత్రం షూటింగ్‌ను నిలిపివేశారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది
ఈ సందర్భంగా రాజమౌళి బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘‘ఆర్ఆర్ఆర్’ మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్నారు. వాళ్లకు ఫ్యాన్స్ చాలా ఎక్కువ. వారితో సినిమా చేయడం భారమనిపించలేదు. నా చిన్నప్పుడు సూపర్‌మేన్, స్పైడర్‌మేన్ లాంటి కామిక్ పుస్తకాలు చదివా. అప్పుడు వాళ్లిద్దరు కలిస్తే బాగుంటుందని అనిపించింది. అలా వచ్చిన ఆలోచనేతోనే ఈ ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నా. అన్నీ కలిసి రావడంతో రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నా. నిజజీవితంలో వాళ్లిద్దరు మంచి స్నేహితులు. ఇప్పుడు ఈ చిత్రానికి వారి బంధం ఉపయోగపడుతోంది.’’ అని రాజమౌళి తెలిపారు.
Comments
Post a Comment