లాక్‌డౌన్ టైంలో బరువు పెరగకుండా ఇలా కేర్ తీసుకోండి.

ఇంట్లోనే ఉండండి.. కాలు బయట పెట్టొద్దని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అది ఓ మంచి ఉద్ధేశానికైనా.. ఇళ్లల్లో ఉండేవారికి ఇది పెద్ద సమస్యే. ఎందుకంటే.. తినే తిండిని తగ్గించుకోలేరు. పోనీ తక్కువ తిన్నా అది హెల్త్‌కి మంచిది. 
How to not put on weight in Coronavirus lock down simple exercises plan, లాక్‌డౌన్ టైంలో బరువు పెరగకుండా ఇలా కేర్ తీసుకోండి..
ఇంట్లోనే ఉండండి.. కాలు బయట పెట్టొద్దని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అది ఓ మంచి ఉద్ధేశానికైనా.. ఇళ్లల్లో ఉండేవారికి ఇది పెద్ద సమస్యే. ఎందుకంటే.. తినే తిండిని తగ్గించుకోలేరు. పోనీ తక్కువ తిన్నా అది హెల్త్‌కి మంచిది కాదు. కానీ కేలరీలు కరగాలి. మరి ఇంట్లోనే ఉంటే.. కేలరీలు ఎక్కడ ఖర్చవుతాయి? అదే బయటకు వెళ్లే ఛాన్సుంటే.. జిమ్‌కో, పార్కుకో వెళ్లి ఎక్సర్ సైజులు చేయవచ్చు. అలాగే జాబులకు వెళ్లినా.. శ్రమ ఉంటుంది కాబట్టి కేలరీలు ఖర్చవుతాయి. కానీ ఇప్పుడు ఇళ్లలోనే ప్రజలు ఉండిపోవాల్సి రావడంతో.. ప్రజలు బరువు పెరిగే ప్రమాదం ఉంది.
మాములుగా బ్రిటన్ ప్రభుత్వం అక్కడి వారికి రోజుకోసారి రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్ చేయడానికి అనుమతిచ్చింది. మన ఇండియాలో మాత్రం పర్మిషన్లు లేవు. కాబట్టి.. ఇంట్లోనే ఉంటూ సింపుల్ ఎక్సర్‌సైజులు, మెట్లు ఎక్కి దిగడం, డాబాపై రౌండుగా నడవడం, ఇంట్లో వస్తువుల్ని అటూ ఇటూ కదపడం, ఇల్లంతా క్లీన్ చేసుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా కాస్త బరువు తగ్గొచ్చని అంటున్నారు వైద్యులు.
అలాగే టీలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చొని సినిమాల వంటివి చూడటం కంటే ఇంట్లో ఎప్పటినుంచో పూర్తి చేయాలనుకున్న పనులను చేసుకుంటే మంచిదన్నారు. అంతేకాకుండా తినే ఆహారంలో తక్కువ కేలరీలు ఉండేలా తినాలని సూచిస్తున్నారు. వీలైనంతవరకూ స్నాక్స్ తగ్గించమంటున్నారు. ఆకు కూరలు, కూరగాయల ఆహారం ఎక్కువగా తినాలని చెబుతున్నారు. ఎక్కువ నీరు తాగుతూ.. కూల్ డ్రింకులు, ఐస్ క్రీములు, స్వీట్లు, చాకొలెట్లు తినడం తగ్గించాలంటున్నారు. అలాగే.. సాయంత్రం వీలైనంత త్వరగా రాత్రి భోజనాన్ని తినాలని.. 7 నుంచి 8 గంటలు మాత్రమే నిద్రపోవాలి. ఇలా పైన చెప్పినవన్నీ పాటిస్తే.. కేలరీల బర్న్ అయ్యే ఛాన్స్‌తో పాటు బరువు పెరగకుండా ఉంటారు.

Comments