ధోనీకి చోటు కష్టమే!

సునీల్‌ గవాస్కర్‌
ముంబై: ఐపీఎల్‌లో సత్తా చాటి తిరిగి భారత జట్టులోకి వస్తాడని ఎంఎస్‌ ధోనీపై అతడి అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ కొవిడ్‌-19 ధాటికి ఈ లీగ్‌ జరిగేది అనుమానంగానే మారింది. ఈ నేపథ్యంలో ధోనీ భవిష్యత్‌ ఎలా ఉండబోతుందనే చర్చ ప్రారంభమైంది. ఇప్పటికే పలువురు మాజీలు ఈ విషయంపై భిన్నంగా స్పందించగా.. మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ అయితే ధోనీ జట్టులోకి రావడం చాలా కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ‘నాకైతే టీ20 ప్రపంచకప్‌ జట్టులో ధోనీని చూడాలనే ఉంది.       

కానీ అది చాలా కష్టం. ఇప్పటికే జట్టు చక్కటి ట్రాక్‌లో వెళుతోంది. అయితే అందరు ఆటగాళ్లలాగా ధోనీ బహిరంగంగా రిటైర్మెంట్‌ను ప్రకటించే వ్యక్తి కాదు. అతడి మనస్తత్వానికి తగినట్టుగా నిశ్శబ్దంగా ఆట నుంచి వైదొలుగుతాడని అనుకుంటున్నా’ అని గవాస్కర్‌ తెలిపాడు. మరోవైపు ధోనీ జట్టులోకి రావాలనుకుంటే అతడికున్న అడ్డంకేమీ లేదని వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రాతో పాటు వసీం జాఫర్‌ అభిప్రాయపడగా.. ఇప్పుడున్న పరిస్థితిలో ఎంఎ్‌సకు అసలు జట్టులో చోటెక్కడుందని మాజీ ఓపెనర్‌ సెహ్వాగ్‌ ప్రశ్నించాడు. రాహుల్‌, పంత్‌ రూపంలో ఇద్దరు యువ వికెట్‌ కీపర్లున్నారని గుర్తుచేశాడు

Comments