వర్క్ ఫ్రమ్ హోమ్‌లో హెల్త్ బాగోకపోతే లీవ్ తీసుకోవచ్చా..


ప్రతి ఒక్కరూ నేడు ఇళ్లకే పరిమితమయ్యారు. చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఒకవేళ ఫ్లూ వంటి అనారోగ్యంతో బాధపడుతూ ఉండొచ్చు. ఇటీవలి కరోనా వైరస్ కేసులు దేశ వ్యాప్తంగా వ్యాపించడంతో ఇంటి నుంచి పని చేయాలని ఉద్యోగులను ఆదేశించారు. దీనికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ, ఇంటి నుంచి పనిచేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మీరు ప్రశాంతంగా పనిచేయడగలరు.

ఇంటి నుంచి పని చేయడం ఈ మాట వినడానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ, ఇది అనుకున్నంత సులువు కాదు. ఎందుకంటే, ఇంటి నుంచి పని చేయడం అనేది అనేక సవాళ్లతో కూడుకున్నదనే చెప్పాలి. ఎందుకంటే, ఇంట్లో అనేక సమస్యలు ఉంటాయి. కుటుంబసభ్యులు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉండొచ్చు. ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయకపోవడం కావొచ్చు. ఇలాంటివన్ని జరుగుతుంటాయి.

ఏదేమైనా పని పూర్తి చేయడం వ్యాపారాలకు చాలా ముఖ్యం. కానీ, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం కూడా అంతే కీలకం. ఇదంతా పని, వ్యక్తిగత జీవితాల మధ్య సరిహద్దులను సృష్టించడం అనేది ఒక కష్టమైన పని. మీ వాదనతో సంబంధం లేకుండా టెలికమ్యూటింగ్, ఇంటి నుండి పని చేయడం, స్వీయ-నిర్బంధించడం కోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. 

టైమింగ్స్ పాటించండి...
మీరు ఇంటి నుంచి పని చేసేటప్పుడు ఒక షెడ్యూల్ సెట్ చేసి దానికి కట్టుబడి ఉండండి. ఏ సమయంలో పని చెయ్యాలని టైమ్ సెట్ చేసుకుంటారో ఆ టైమ్ అయిపోయాక ఇంకా పని ఆపేయండి. ఇది మీ మెదడుని పని చేయడానికి సమయం, విశ్రాంతి తీసుకోడానికి సాయం చేస్తుంది. విశ్రాంతి లేకుండా పనిచేయడం అంటే మీ వ్యక్తిగత జీవిత షెడ్యూల్‌తో అదనపు సౌలభ్యం ఉందని అర్థం. మీరు ఉత్పాదకతతో కూడిన షెడ్యూల్‌కి కట్టుబడి ఉండటం, మీ పనిని అనుకున్న సమయంలో పూర్తి చేసుకోవడం, పని గంటలు ముగిసిన పనిని ముగించడం మంచిది.

Comments