సెప్టెంబర్ 28, 2007 మెగాస్టార్ చిరంజీవి నటవారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పరిచయం అయినరోజది. చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు టాలీవుడ్ మొత్తం మెగావారసుడి రామ్ చరణ్-పూరీ కాంబో మూవీ ‘చిరుత’ కోసం ఎదురుచూసిన సందర్భం. అనుకున్నట్టుగానే ‘చిరుత’ విడుదలై ఇండస్ట్రీ ప్రముఖుల మన్ననలు అందుకుంది. హీరోగా రామ్ చరణ్‌కి ప్రశంసలు దక్కాయి. పూరీ మార్క్ డైరెక్షన్, చిరంజీవి పర్యవేక్షణ, ఇండస్ట్రీ ప్రముఖల సలహాలతో తొలిసినిమా చిరుతతో శభాష్ అనిపించుకున్నారు రామ్ చరణ్.సినిమా హిట్ అయ్యింది. ఆ సినిమాకి ప్రశంసలతో పాటు పెదవి విరుపులు చాలానే వచ్చాయి. ఆ సందర్భంలో చాలా మంది నోటి నుంచి వచ్చిన మాట.. రామ్ చరణ్ చిరంజీవి కొడుకు కాకపోతే హీరో అయ్యేవాడా? సినిమా కథ బాగానే ఉన్నా.. రామ్ చరణ్ ఫైట్స్, డాన్స్‌లతో ఇరగదీసినా.. ఆయన మేకోవర్ సరిగా లేకపోవడం, డైలాగ్ డెలివరీ పర్ఫెక్ట్‌గా సూట్ కాకపోవడంతో ప్రసంసలతో పాటు విమర్శలు వచ్చాయి. ఏదో చిరంజీవి కొడుకు కాబట్టి హీరోగా వచ్చాడు కాని.. ఇతనిలో హీరో అయ్యేంత మేజర్ క్వాలిటీస్ లేవబ్బా.. అనే పెదవివిరుపులు చాలానే వచ్చాయి. రామ్ చరణ్ ఈ సందర్భాల్లో వేచిచూశారు.
రాజమౌళితో మగధీర ఇండస్ట్రీ హిట్.. కాని
009లో రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ సినిమా విడుదలైంది. ‘చిరుత’లా మెరిసి రాజమౌళి చేతిలో పడ్డ రామ్ చరణ్ టాలీవుడ్‌కే మరుకేరాని మధురకావ్యం లాంటి చిత్రాన్ని అందించారు. అదే మహారణయోధుడు కాలభైరవుడు వీర ప్రేమగాధ ‘మగధీర’. ప్లాష్ బ్యాక్ ప్రేమకథల జమానా పోయి చాలారోజులైపోయిన తరుణంలో చక్కని చందమామ కథలాంటి కథతో వచ్చిన రామ్ చరణ్ సినీ సునామీనే క్రియేట్ చేశాడు. తొలి సినిమా హిట్.. రెండో సినిమా బ్లాక్ బస్టర్ ఏ హీరోకి ఏ హీరోకి అయినా ఇంతకంటే ఏం కావాలి? మెగా అభిమానుల అండదండలతో పాటు.. కోట్లు పెట్టి కొన్నా రాని ఒకవైపు మెగాస్టార్, మరోవైపు పవర్ స్టార్ క్రేజ్ తనకూ ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఈ తరంలో రామ్ చరణ్‌కి తిరుగేలేదనుకున్నారు. అయితే ‘మగధీర’ హిట్ క్రెడిట్ రామ్ చరణ్ ఖాతాలో పడటం కష్టంగా మారింది. ఆ చిత్రం దర్శకుడిగా ప్రతిభగానే తేల్చేశారు. రామ్ చరణ్ కాకుండా ఏ హీరోతో తీసినా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది.. కథ అలాంటిది అనే కామెంట్స్ వినిపించాయి. ఈ సందర్భంలో కూడా రామ్ చరణ్ వేచే చూశారు.
Comments
Post a Comment