కరోనా వైరస్‌కు సంబంధించి మెగాస్టార్ మరో వీడియో పోస్టు చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కరోనా నేపథ్యంలో జనతా కర్ఫ్యూ పాటించమని పిలుపునిచ్చింది. ఆదివారం దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవ్వాలని కోరింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు ప్రజలంతా ఇళ్లలోనే సూచించాలని సూచించింది. దీనిపై మెగాస్టార్ స్పందించారు. మోదీ జనతా కర్ఫ్యూకు మద్దతిస్తూ ఆయన వీడియో పోస్టు చేశారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం 24 గంటలు పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, స్వచ్ఛ కార్మికులు, ఇతర వైద్య ఆరోగ్య బృందానికి, పోలీసులకు, ప్రభుత్వాలను ప్రశంసించాల్ని సమయం ఇది. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు మనమంతా జనతా కర్ఫ్యూను స్వచ్ఛందంగా పాటిద్దామన్నారు. ఇళ్లకే పరిమితం అవుదామన్నారు. సరిగ్గా సాయంత్రం గంటలకు ప్రతీ ఒకరు మన ఇంటి గుమ్మాల వద్దకు వచ్చి కరతాళ ధ్వనులతో సేవలందిస్తున్న వారికి ధన్యవాదాలు తెలపాల్సిన సమయం ఇది అని పేర్కొన్నారు చిరు. అది మన ధర్మం అన్నారు.
Comments
Post a Comment