ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి ఫేమస్ అయిన వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్ దేవరకొండ. ఈ మధ్య వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. తను ఎంచుకునే స్టోరీ లైన్, సినిమా తెరపైకి వచ్చేసరికి మారిపోతుండటంతో. తెలుగు ప్రేక్షకుల ఆధరణ రోజు రోజుకు తగ్గిపోతుంది. దర్శకత్వంలో, కథలో దేవరకొండ వేలు పెట్టడమే ఇందుకు కారణమన్న ప్రచారం, విమర్శలు జోరుగా సాగుతున్నాయి.
తెలుగులో విజయ్ దేవరకొండకు అతిపెద్ద డిజాస్టర్గా ఉన్న వరల్డ్ఫేమస్ లవర్ను హిందీలో తీసుకరాబోతున్నాడు ప్రముఖ నిర్మాత కరణ్జోహర్. ఇప్పటికే దేవరకొండను ఫైటర్మూవీ ద్వారా హిందీ తెరకు పరిచయం చేయబోతున్న ఈ నిర్మాత. ఇప్పుడు రీమేక్ రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను ఇటీవలే చూసి. ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. హిందీ ప్రేక్షకులకు కథ సరిపోతుందని ఆయన అంచనాకు వచ్చారట.
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ మూవీలో చేస్తున్న విజయ్ను. హిందీలో కరణ్ జోహర్ రిలీజ్ చేయబోతున్నాడు.

Comments
Post a Comment