దక్షిణాఫ్రికా జట్టుకు 'కరోనా' సూచనల

 ముంబయి: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్  భారత్లోనూ విస్తరిస్తోండటంతో దక్షిణాఫ్రికా జట్టు యాజమాన్యం తమ ఆటగాళ్లకు కొన్ని జాగ్రత్తలు సూచించినట్లు తెలుస్తోంది. జట్టు సభ్యులు ఆరోగ్య నియమాలు పాటించాలని, అంతేకాక అభిమానులతో సెల్ఫీలు, ఫొటోలు, సంభాషణలు చేయకూడదని యాజమాన్యం తెలిపినట్లు సమాచారం. ''విదేశాలకు వెళ్లేటప్పుడు ఆటగాళ్లకు ఆరోగ్య జాగ్రత్తలు వివరించాం. ఇవి వారికే కాకుండా ఇతరులకు కూడా ఉపయోగపడతాయి. అభిమానులతో సెల్ఫీలు, ఫొటోలు దిగకూడదని ప్లేయర్లకు సూచించాం'' అని దక్షిణాఫ్రికా జట్టు యాజమాన్య వర్గాలు తెలిపాయి. ఈ సూచనలు వన్డే సిరీస్తో పాటు ఐపీఎల్లోనూ పాటించాలని తెలిపినట్లు సమాచారం.

 మూడు వన్డేల సిరీస్ కోసం భారత పర్యటనకు దక్షిణాఫ్రికా వచ్చింది. భారత్లో కరోనా వ్యాపిస్తుండటంతో ఇక్కడ పర్యటించినన్ని రోజులూ కోహ్లీసేన సహా ఎవరితోనూ కరచాలనం చేయకపోవచ్చని దక్షిణాఫ్రికా క్రికెట్కోచ్మార్క్ బౌచర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా ఎఫెక్ట్ ఐపీఎల్పై ఉంటుందనే వాదనలను ఓ బీసీసీఐ ఉన్నతాధికారి వ్యతిరేకించారు. ఇటీవల ఇండియన్&సూపర్ లీగ్లో జరిగిన ఏటీకే×బెంగళూరు ఎఫ్సీ మ్యాచ్కు దాదాపు 60 వేల మంది వచ్చారని, కరోనా ప్రభావం భారత్లో క్రీడలపై లేదని తెలిపారు. పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికాతో భారత్ ధర్మశాల వేదికగా మార్చి 12న తొలి వన్డే, లఖ్నవూ వేదికగా మార్చి 15న రెండో వన్డే, కోల్కతాలోని ఈడెన్గార్డెన్స్లో మార్చి 18న ఆఖరి వన్డే ఆడనుంది. 

Comments