కరోనాపై వార్‌ : కూలీలకు ఉచితముగా ఆహారం . కేంద్రం బారోశ

Central Government Announces Measures For Unorganised Sector - Sakshi
మహమ్మారి కరోనా వైరస్‌ ప్రబలుతున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన మూడు వారాల లాక్‌డౌన్‌తో అసంఘటిత రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పనుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్న వ్యవసాయ కూలీలు, కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి. వ్యవసాయ కూలీలు, వలస కార్మికులు, ఫ్యాక్టరీ వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికుల భారీ వలసలను అడ్డుకోవాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు సూచించింది. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఉచితంగా ఆహారం అందేలా చూడాలని కోరింది. హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్, అద్దె వసతి గృహాలకు నిత్యావసరాలు అందేలా చూడాలని సూచించింది. విద్యార్థులు, వర్కింగ్ వుమెన్‌కి నిత్యావసరాలు నిరాటంకంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర హోంశాఖ కోరింది.

Comments