రైల్వేలో 2792 పోస్టులు.. రేపే లాస్ట్ డేట్.. డోన్ మిస్ ఇట్...?

ఏదైనా చివరి తేదీ వరకూ వెయిట్ చేయడం చాలామందికి అలవాటు .. ఇది అంత మంచి పద్దతి కాదు .. ఇలాంటి ధోరణితో మంచి అవకాశాలు కూడా జారిపోతాయి . ఈ అవకాశం కూడా అలాంటిదే .. రైల్వే జాబ్ అంటే అదో గౌరవం , భరోసా .. చిన్న ఉద్యోగమైనా సరే రైల్వే వంటి సంస్థలో సంపాదించాలని చాలా మంది కోరుకుంటారు . ఇప్పుడు మీకు ఆ ఛాన్స్ వచ్చేసింది .



ఈస్టర్న్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది . మొత్తం 2792 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది . ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది . దీనికి రేపే లాస్ట్ డేట్ .. ఈ ఉద్యోగాలకు 10 వ తరగతి పాసై సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి . వయస్సు - 15 నుంచి 24 ఏళ్లు . ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు కూడా ఉంటుంది .


ఇక ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి .


మొత్తం ఖాళీలు - 2792


ఫిట్టర్ - 1070

వెల్డర్ -547

మెకానిక్ ( ఎంవీ )- 9

మెకానిక్ ( డీజిల్ )- 123 బ్లాక్‌స్మిత్ - 9

మెషినిస్ట్ - 74

కార్పెంటర్ -20

పెయింటర్ - 26

లైన్‌మ్యాన్ - 49

వైర్‌మ్యాన్ - 67

రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్ - 54

ఎలక్ట్రీషియన్ - 593

మెకానిక్ మెషీన్ టూల్ మెయింటనెన్స్ - 9

ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 75

టర్నర్ - 67


దరఖాస్తుకు చివరి తేదీ - రేపే అంటే మార్చి 13, 2020

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు https://www.rrcer.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు .

Comments