డిసెంబర్ నుంచి ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 5.60 లక్షల మందికిపైగా ఈ వైరస్ బారిన పడ్డారు. కరోనా బాధితుల్లో అమెరికా చైనాను దాటేసిన సంగతి తెలిసిందే. అగ్రరాజ్యంలో 83,338 మందికిపైగా కోవిడ్ బారిన పడగా.. 1321 మంది చనిపోయారు. మరోవైపు లాటిన్ అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 11 వేలు దాటిందని ఏఎఫ్‌పీ తెలిపింది.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హ్యాంకాక్ కరోనా బారిన పడినట్లు తేలింది. బ్రిటన్‌లో కరోనా పేషెంట్ల సంఖ్య 14,579 దాటగా.. మృతుల సంఖ్య 759గా నమోదైంది. శుక్రవారం ఒక్కరోజే బ్రిటన్లో 189 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.
Comments
Post a Comment