‘కార్తీకదీపం’ మార్చి 25 ఎపిసోడ్: సూపర్ ట్విస్ట్! సౌందర్య ముందే.. ‘హిమ నా కన్నకూతురని..’

       గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..
హిమని స్కూల్ మానిపించే విషయం గురించి తెలుసుకోవడానికి.. దీప ప్రిన్స్‌పాల్‌ని కలవడానికి స్కూల్‌కి వెళ్తుంది. అయితే.. ప్రిన్స్‌పాల్ లేకపోవడంతో అతడి కోసం వెయిట్ చూస్తూ ఉంటుంది దీప. కార్తీక్ ఇళ్లంతా తిరుగుతూ.. ‘హిమా.. హిమా..’ అని పిలుస్తుంటాడు. సౌందర్య, ఆనందరావులు బయటికి రావడంతో.. ‘హిమ మీతో ఉందా?’ అని అడుగుతాడు కార్తీక్. ‘పైన గదిలోనే ఉందిగా?’ అంటాడు ఆనందరావు. ‘లేదు డాడీ..’ అంటూనే కిచెన్‌లో ఉన్న పని మనిషి మాలతీని పిలుస్తాడు. మాలతీ బయటికి రావడంతో ‘హిమని చూశావా?’ అంటాడు. ‘లేదు బాబు.. ఇందాక మెట్లు దిగడం చూశాను’ అంటుంది కంగారు. దాంతో సౌందర్య, ఆనందరావులకి కంగారు పెరిగిపోతుంది. ‘నాకు తెలుసులే మీరు కూడా నాతో రండి.. మమ్మీ.. డాడీ మీరు కూడా’ అంటూ చాలా కూల్‌గా బయటికి తీసుకుని వెళ్తాడు కార్తీక్. సౌందర్య కంగారుపడుతూ.. ‘మాలతీ.. అది(హిమ) ఇంటికి వస్తే కాల్ చేసి చెప్పు’ అంటూ కార్తీక్ వెనుకే బయలుదేరుతుంది. ‘ఏం రాదేలే మమ్మీ నువ్వు రా’ అంటూ కార్తీక్ వేగం నడుస్తాడు. 
 
కమింగ్ అప్‌లో...‘నా కూతుర్ని నువ్వు దూరం చేస్తున్నాననే.. నేను ఈ నిర్ణయం తీసుకున్నాను.. అయినా నా కూతురి విషయాలు తెలుసుకోవడానికి నువ్వు ఎవరు? నా కూతురు బాధని అర్థం చేసుకోవడానికి, పట్టించుకోవడానికి నువ్వు ఎవరు?’ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటాడు కార్తీక్. దాంతో దీపకు పిచ్చ కోపం వస్తుంది. ‘నేను ఎవరా? నేను ఎవరా? నేను ఎవరినో.. ఈమెని అడగండి’ అంటూ పక్కనే ఉన్న సౌందర్యని ముందుకు లాగుతుంది దీప ఆవేశంగా.. దాంతో కార్తీక్ షాకింగ్‌గా చూస్తుంటాడు. దీప ఏదో మాట్లాడుతూ ఉంటుంది. అయితే.. సౌందర్య దీప పురిటి సమయంలో హిమని తీసుకొచ్చే విజువల్ కనిపిస్తూ ఉంటుంది. అంటే దీప కార్తీక్‌కి జరిగింది చెప్పేస్తుందే అర్థం అవుతుంది. అయితే ఇది నిజమా? లేక కలా అనేది రేపు తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! కార్తీకదీపం కొనసాగుతోంది.

Comments