ఉపరాష్ట్రపతి చొరవ.. ఏపీకి రూ.2,498 కోట్లు
అమరావతి: ఉపరాష్ట్రతి వెంకయ్య నాయుడు చొరవతో ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,498.89 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఏపీలో రైతుల నుంచి ధాన్యం సేకరణ, చెల్లింపులపై మీడియాలో వచ్చిన కథనాలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. నిధుల విడుదల కోసం కేంద్ర మంత్రులతో మాట్లాడారు. ఈ క్రమంలోనే కేంద్రం ఎఫ్‌సీఐకి రూ.2,498.89 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులను ఏపీ పౌరసరఫరాల శాఖకు బదిలీ ఎఫ్‌సీఐ బదిలీ చేయనుంది.

Comments
Post a Comment