ప్రధాని సంచలన నిర్ణయం..21రోజుల పాటు లాక్ డౌన్!

దేశంలో కరోనా కేసుల సంఖ్య 500కు చేరింది. నిన్న ఒక్కరోజే ఏకంగా 99 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. 21రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు తెలిపారు. 21 రోజులు ఓపిక పట్టండి లేదంటే 21 సంవత్సరాలవరకు వెనక్కి వెళ్లాల్సి ఉంటుందన్నారు. అన్ని రాష్ట్రాలు ముందు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కేవలం ఒకరికి ఒకరు దూరంగా ఉండటం ద్వారానే వైరస్ ను నివారించవచ్చని అన్నారు. 21రోజుల బంద్ జనతా బంద్ కంటే కఠినంగ ఉంటుందన్నారు. కాబట్టి ప్రాజలందరు సహకరించాలని మోడీ కోరారు.

Comments