కసరగడ: కేరళలో కరోనా పాజిటివ్ కేసులు 112కు చేరుకున్నాయి. అయితే.. కరోనా వైరస్ ఒక మనిషి నుంచి మరొకరికి ఎంత త్వరగా వ్యాప్తి చెందుతుందో చెప్పడానికి కేరళలోని కసరగడ్ జిల్లాలో జరిగిన ఉదంతమే ఉదాహరణ. లాక్‌డౌన్ ఎంత అవసరమో ఈ ఘటన గురించి తెలిస్తే అవగతమవుతుంది. కేరళలోని కసరగడ జిల్లాలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మార్చి 16న ఆ వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్య పరీక్షల అనంతరం తెలిసింది.
అయితే.. అతను హోం ఐసోలేషన్‌ను పాటించే 20 నిమిషాల ముందు తన బిడ్డ, భార్య, తల్లితో మాట్లాడినట్లు తెలిపాడు. తర్వాత వారికి దూరంగా ఉంటూ హోం ఐసోలేషన్‌ను పాటించాడు. అతను దుబాయ్ నుంచి వచ్చిన విషయం తెలుసుకున్న అధికారులు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు చేయించారు. మార్చి 20న అతని కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య పరీక్షల్లో స్పష్టమైంది. అంతేకాదు, అతనిని ఎయిర్‌పోర్ట్ నుంచి కారులో తీసుకొచ్చిన స్నేహితుడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు స్వయంగా ఆ జిల్లా కలెక్టరే వెల్లడించారు.
Comments
Post a Comment