నోట్ల రద్దు తర్వాత చెలామణీలోకి వచ్చిన రూ.2000 నోటుపై దేశ ప్రజల్లో కొంతవరకూ వ్యతిరేకత ఉందన్న వాదన వినిపిస్తోంది. ప్రధానంగా ఈ నోటు ఏటీఎంలలో వస్తే... దీని ద్వారా వస్తువులు కొనుక్కోవాలంటే ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఏ వంద రూపాయల సామాన్లో కొని... రూ.2000 నోటు ఇస్తే... చిల్లర లేదంటున్నారు వ్యాపారులు. అందువల్ల ఈ నోటును మార్పిడి చేసుకోవడం కోసం కనీసం రూ.300 వస్తువులు కొనాల్సి వస్తోంది. ఇలా రూ.2000 నోటు చెలామణీలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని క్యాష్ చేసుకుంటున్న కొందరు వక్రమార్కులు... ఈ నోటుపై లేనిపోని అపోహలు, అసత్యాలూ ప్రచారం చేస్తూ ప్రజల్ని గందరగోళంలో పడేస్తున్నారు. త్వరలోనే రూ.2000 నోటును బ్యాన్ చేస్తారనీ, ఇక అది మార్కెట్లలో కనిపించదనీ తాజాగా ప్రచారం చేస్తుంటే
కేంద్రం అప్రమత్తమై... క్లారిటీ ఇచ్చింది.దేశంలో రెండు వేల రూపాయల నోట్లను మార్కెట్ నుంచి తొలగించాలన్న దానిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సోమవారం లోక్సభలో తెలిపారు. ప్రభుత్వరంగంలోని ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్లు.... రూ.500 నోట్లు, రూ.200 నోట్లు ఏటీఎంలలో వచ్చేలా ఏటీఎంలలో కొన్ని మార్పులు తెస్తున్నాయని ఆయన తెలిపారు. దేశంలో రూ.500, రూ.200 నోట్లకు డిమాండ్ బాగా పెరిగిందన్న ఆయన... రూ.2000 నోట్లను మార్పిడి చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నమాట వాస్తవమే అన్నారు. అందుకే ఆ నోట్ల బదులుగా... ఎక్కువ సంఖ్యలో రూ.500, రూ.200 నోట్లు ఏటీఎంలలో వచ్చేలా చేస్తున్నామన్నారు. అలాగని పూర్తిగా రూ.2000 నోట్లు రావని కాదు. తక్కువ సంఖ్యలో వస్తాయన్నమాట. ఇప్పటివరకు 7.40 లక్షల కోట్ల విలువైన రూ.2000 కరెన్సీని ముద్రించినట్లు ఆయన తెలిపారు. అందువల్ల ప్రజలు ఎలాంటి భయాలూ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రూ.2000 నోట్లు కొనసాగనున్నాయి.
నోట్ల రద్దు తర్వాత చెలామణీలోకి వచ్చిన రూ.2000 నోటుపై దేశ ప్రజల్లో కొంతవరకూ వ్యతిరేకత ఉందన్న వాదన వినిపిస్తోంది. ప్రధానంగా ఈ నోటు ఏటీఎంలలో వస్తే... దీని ద్వారా వస్తువులు కొనుక్కోవాలంటే ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఏ వంద రూపాయల సామాన్లో కొని... రూ.2000 నోటు ఇస్తే... చిల్లర లేదంటున్నారు వ్యాపారులు. అందువల్ల ఈ నోటును మార్పిడి చేసుకోవడం కోసం కనీసం రూ.300 వస్తువులు కొనాల్సి వస్తోంది. ఇలా రూ.2000 నోటు చెలామణీలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని క్యాష్ చేసుకుంటున్న కొందరు వక్రమార్కులు... ఈ నోటుపై లేనిపోని అపోహలు, అసత్యాలూ ప్రచారం చేస్తూ ప్రజల్ని గందరగోళంలో పడేస్తున్నారు. త్వరలోనే రూ.2000 నోటును బ్యాన్ చేస్తారనీ, ఇక అది మార్కెట్లలో కనిపించదనీ తాజాగా ప్రచారం చేస్తుంటే.

Comments
Post a Comment