ధోనీ 2.0: 5 బంతుల్లో 5 సిక్సర్లు!

ధోనీ 2.0: 5 బంతుల్లో 5 సిక్సర్లు!

చెన్నై: దీర్ఘకాలిక విరామం తర్వాత పొట్టి క్రికెట్‌కు సన్నద్ధమవుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి ఎంఎస్‌ ధోనీ ప్రాక్టీస్‌లో అదరగొడుతున్నాడు. అయిదు బంతుల్లో వరుసగా అయిదు సిక్సర్లు బాది 'ధనాధన్‌ ధోనీ'ని గుర్తు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను స్టార్‌ స్పోర్ట్స్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇది అధికారిక మ్యాచ్‌ కాకపోయినా విరామం తర్వాత 'తలా' బ్యాటు ఝళిపించడం సీఎస్‌కే అభిమానులకు శుభవార్తే.
ప్రపంచకప్‌ సెమీస్‌లో ఓటమి అనంతరం ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 29న ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 13వ సీజన్‌లో అతడు పునరాగమనం చేయనున్నాడు. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌తో సీఎస్‌కే తలపడుతుంది. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ వేలంలో లెగ్‌స్పిన్నర్‌ పియూష్ చావ్లా, ఆస్ట్రేలియా పేసర్‌ జోన్‌ హేజిల్‌వుడ్‌, ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ శామ్‌ కరన్‌, తమిళనాడు స్పిన్నర్‌ ఆర్‌ సాయికిషోర్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Comments