అమెరికాలో అల్లకల్లోలం-ఒక్కరోజులోనే 16,877 కరొన కేసులు


ప్రపంచంలోనే అత్యధిక కేసులు అమెరికాలో.. ఒక్కరోజులోనే 16,877 
వారం క్రితం 8 వేలే.. ఇప్పుడు పదింతలు.. చైనా, ఇటలీలను దాటేసింది
1400కు చేరువలో  మరణాలు.. విషమ స్థితిలో మరో 2వేల మంది
80వేల మంది చనిపోవచ్చంటున్న నిపుణులు.. అయినా ట్రంప్‌ బేఫికర్‌  

వాషింగ్టన్,మార్చి 27:కరొన వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికా అల్లకల్లోలం అయింది.గురువారం ఒక్కరోజే ఏకముగా 16,877 కేసులు నమోదుతో బెంబేలెత్తిపోఎనది. మరణాల సంఖ్య 1400 ధాటిపోగా..కేసులు 93వేలు దాటిపోయాఈ .వారం క్రితం ఇవి కేవలం 8 వేలు. ఇంత తక్కువ వ్యవది లో 11 రేట్లు పేరుగుతాయని ఊహించలేదని,వ్యాధి 3 వ దశను కూడ దాటిపోతుందని ఆరోగ్యశాఖ అధికారి ఒకరు చెప్పారు.కేసుల సంఖ్యలో అమెరికా.. చైనా (81,340) , ఇటలీ (80,589) లాను మించిపోయింది.అఐతే,మరణాల్లో ఇటలీ కంటే తక్కువ."ప్రజల సామాజిక దూరాన్ని ఖచ్చితముగా పాటించిన ,పెద్ద సంఖ్యలోస్వయ నిర్భయందములోకి వెళ్ళిన కూడ మరణాల సంఖ్య 80 వేలు దాతవ్వచ్చు. వ్యాది తీవ్రత ,వ్యాప్తి అలా ఉంది మరి !ఏప్రిల్ 12 కల మళ్ళీ దేశ ఆర్ధికరంగా కార్యకలాపాలు మొదలెట్టేస్తామని ట్రంప్‌ చెబుతున్నా అది ఆచరణ సాధ్యం కాదు. ప్రజలకు కాస్త ఆశావహమైన పరిస్థితిని కల్పించడమే ఆయన ఉద్దేశం’’ అని ఆరోగ్య నిపుణుడు ఆంథోనీ ఫాసీ అన్నారు.
 న్యూయార్క్‌కు పెద్ద దెబ్బ
అనేక ప్రపంచస్థాయి కార్యాలయాలకు, కంపెనీల హెడ్‌క్వార్టర్లకు నెలవైన న్యూయార్క్‌ నగరం ఇపుడు కొవిడ్‌-19కు కేంద్ర స్థానంగా మారింది. గురువారమే అక్కడ 177 మంది చనిపోయారు. దీంతో నగరంలో మరణాల సంఖ్య 365కు పెరిగింది. కేసులు కూడా ఇక్కడే ఎక్కువ. ఇప్పటిదాకా 23,112 మందికి వైరస్‌ సోకింది. న్యూయార్క్‌ రాష్ట్రంలో  40వేల మందికి  ప్రబలింది. 457 మంది మరణించారు. వాషింగ్టన్‌ డీసీ, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, ఇల్లినాయి, మిచిగన్‌, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, టెక్సస్‌, లూసియానా, జార్జియాల్లోనూ కొవిడ్‌ ఉద్ధృతి ఉంది. లూసియానాలో వైరస్‌ వ్యాప్తి 30 శాతానికి పైగా పెరిగింది. చికాగో, డెట్రాయిట్‌ చుట్టుపక్కల కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నట్లు శ్వేతసౌధంలో కరోనా సమన్వయకర్త డెబ్రా బర్క్స్‌ చెప్పారు. 
ట్వీట్లు ఆపి.. కార్యాచరణకు దిగండి
అమెరికా అంతటా మాస్క్‌లు, ఐసీయూలు, వైద్య ఉపకరణాల కొరత విపరీతంగా ఉంది. వ్యాధి నియంత్రణకు సకాలంలో స్పందించడం లేదంటూ ట్రంప్‌- ప్రతిపక్షమైన డెమొక్రాట్ల అధీనంలో ఉన్న రాష్ట్రాల గవర్నర్లను మరోమారు తీవ్రంగా విమర్శించారు. ‘ఇది మీ వైఫల్యమంటూ’ తిట్టిపోశారు. దీనిపై ఇల్లినాయి, మిచిగన్‌ సహా పలు రాష్ట్రాల గవర్నర్లు మండిపడ్డారు. అఽధ్యక్ష ఎన్నికల కోసమే తన వైఫల్యాలను ట్రంప్‌ కప్పిపుచ్చుకోజూస్తున్నారని, నెపం తమపై నెడుతున్నారని  విమర్శించారు. ‘ట్విటర్‌ పోస్టులు పెట్టడం ఆపి మొదట కార్యాచరణ మొదలెట్టండి’ అని ఏకిపారేశారు. .  


Comments