నర్తనశాల :
కీచకుడు పగటి వేషధారివలె తన అలంకరణలను మాలిని వద్ద ప్రదర్శించడం మొదలు పెట్టాడు. కాళ్ల కడియాలను విలాసంగా నేలకు తాటించి, వయ్యారంగా నడుస్తూ చిత్రాతిచిత్రమైన సవ్వడులను సృష్టిస్తున్నాడు. వికృత భంగిమలలో వొళ్లు విరుచుకుని, వెకిలి నవ్వు నవ్వి తన రూప లావణ్యాలకు తానే మురిసిపోయాడు. భవనపు పాలరాతి స్తంభాలపై మునివేళ్లతో తాళం వేస్తూ, కూనిరాగాలు తీశాడు. వెలలేని వుంగరపు రాళ్ల మెరుపులు మాలిని కంటపడేట్టు వాటిని తిపతున్నాడు. ఎన్ని చేష్టలు చేసినా ఆమె కనులు కాదు కదా, చెవులైననూ వానిని గమనించలేదు. ఇక యీ మూగబాసలతో ప్రయోజనం లేదని ‘‘సైరంథ్రీ, సౌందర్యరాశీ! నీ పాదకమలాలను సేవించుకోగల భాగ్యం అబ్బితే, అంతకు మించిన అదృష్టం లేదనుకుంటాను. నాపై విముఖతా లేక వైరాగ్యభావమా? ఎన్ని విధాల అర్థించినా దయమాలి నన్ను కాదనడం భావ్యమా? ఈ సువిశాల రాజ్యంలోని సిరి సంపదలు నీ సొంతం. యీ నగరిలోని భామినులందరూ నీ చెలికత్తెలు. విరాటుడు మత్స్యదేశాధిపతి యని భ్రమిస్తున్నావేమో. ఆయన రాజపదవి నామమాత్రం. నా అసహాయ శూరత్వమే విరటుని సింహాసనానికి కాళ్లు, చేతులు. మాలినీ, ఆనాడు రాజవీధిలో నిన్ను అవమానించినపడు కొలువులో వొక్కరైననూ పెదవి మెదిపారా? కనీసం రాజైననూ యిదేమని అన్నాడా? అయిదుగురు గర ధర్వులు, మహాబలశాలురు భర్తలుగా వున్నా నిన్ను ఆదుకున్నవారే లేకపోయారు. నేను యిష్టంతో నీ పొందును అభిలషిస్తున్నాను. లేకుంటే నన్ను అడ్డుకోగల వారెవరూ లేరు సుమా’’ అంటూ హెచ్చరికతో ముగించాడు.

పాంచాలి వాని ధోరణిని గమనించింది. ఉన్మాదిని రెచ్చగొట్టడం శ్రేయస్కరం కాదనుకుంది. ముఖంలోని రోషావమాన భావాలను దిగమింగి, బలవంతంగా పెదవులపైకి చిరునవ్వు తెచ్చుకున్నది. ‘‘సింహబలా, మీ మగవారెపడూ యింతే. మీ తమకమే గాని ఎదుటివారి మనసు పసికట్టరు. ఎంతటి గాఢానురాగంతో వున్నా, నావంటి మగువలెపడూ బయటపడరు. వలదు వలదని ఎన్ని విధాల మొరపెట్టుకున్నా, వెనుక ముందులాలోచించక పదిమందిలో నన్ను ఆరడి పెడుతున్నావు. నిగూఢంగా కోరికలు తీర్చుకోవడం శ్రేయస్కరం కదా’’. పాంచాలి మాటలకు ఆనందంతో కీచకునికి మతి భ్రమించినట్టయింది. పూర్తిగా ఆమెకు వశుడై, ‘‘అయితే యిపడు నేను ఎట్లా ప్రవర్తించాలో ఆజ్ఞాపించు’’ అంటూ విధేయుడై నిలబడ్డాడు సింహబలుడు.తను పన్నిన వుచ్చులో కీచకుడు పడ్డందుకు ద్రౌపది సంతోషించింది. స్వరం తగ్గించి, ‘‘సింహబలా! నర్తన శాల మనకు అన్ని విధాలా అనువైన తావు. నేటి రాత్రి, నాట్యశాలకు... ఒంటరిగా...’’ సిగ్గులతో గుసగుసలాడింది. సింహబలుడు ఆనంద పారవశ్యంతో మెలికలు తిరిగిపోయాడు. కొద్దిసేపు మాలినిని క్రీగంట చూస్తూ, శిలా ప్రతిమలా వుండి, సుందరీ! యింతమాత్రం కరుణించావు. నా జన్మధన్యమైంది. నీ ఆజ్ఞ శిరసావహించి, నీ అడుగులకు మడుగులొత్తనా? నేటి రాత్రి, నర్తన శాలలో, నిలువెల్లా కనులు చేసుకుని నీ రాకకై నిరీక్షిస్తాను, మరి, నువ్వు మాట తప్పకూడదు సుమా!’’ అన్నాడు లాలనగా. మాలిని విలాసంగా నవ్వి, ‘‘నీ మీద ఆన. రాజా, యిక్కడ మనం ఎక్కువ సేపు ముచ్చటలాడడం మంచిదికాదు. పోయి రమ్ము’’ అంటూ పాకశాల వైపు కదిలింది. నెరవేరిన మనోరథంపై కీచకుడు తన మందిరానికి చేరాడు. జరిగినదంతా పూసగుచ్చినట్టు వలలునికి వివరించింది మాలిని. భీముడు ఆహ్లాద పారవశ్యంలో మునకలు వేశాడు.సింహబలునికి క్షణమొక యుగంలా గడుస్తోంది. సైరంధ్రీ సౌందర్య సంస్మరణలో ఆకలి దపలు మరిచాడు. వున్మత్త చిత్తంతో కీచకుడు అస్థిమితంగా తిరుగాడుతున్నాడు. సూర్యాస్తమయం అయింది. విరాట రాజ నగర వీధులలో సందడి సద్దుమణిగింది. అంతకు మునుపే ఉదయించిన నెలవంక మున్నీటి కెరటాల ముంగురుల మధ్య దోబూచులాడుతున్నది. సైరంథ్రి సంకేతాన్ని అందుకుని, భీమసేనుడు మేలిముసుగును నిండుగా కపకుని బయలు దేరాడు. వారిద్దరూ చిమ్మచీకటిలో నర్తన శాలకు చేరారు. విశాల శాల నడుమ మాణిక్య కాంతులీనుతూ వొక శయ్య కనిపించింది. పాంచాలిని అచటి స్తంభం వెనుక నిలబడమని, భీముడు ఆ తల్పంపై పవళించాడు. అప్పటికే మదనోద్మాదంతో కలయ తిరుగుతున్న కీచకునికి శయ్యపై కనిపించిన మానవాకృతిని చూడగానే అనురాగ పారవశ్యం కమ్ముకుంది. ‘‘మాలినీ, యిప్పటికైన ను నన్ను అనుగ్రహించావు...’’ అంటూ తన ధోరణిలో తాను మాట్లాడుతున్నాడు. భీముడు ఆర్ర్దానురాగంతో, ‘‘సింహబలా! నా వంటి వనిత నీకీలోకంలో కానరాదు. నా శరీర స్పర్శతో నీకు దివ్యలోకాలు కనిపించగలవు. ఇక నీకు సంపూర్ణ శాశ్వత శరీర సాఫల్యమే సుమా’’ అంటూ కీచకుని కేశపాశం చేజిక్కించుకున్నాడు. యీ హఠాత్పరిణామానికి వానికి చేష్టలుడిగాయి. వారిద్దరూ మదపు టేనుగుల వలె ద్వంద్వ సమరం సాగిస్తున్నారు. తన భంగపాటు బయట పడుతుందని కీచకుడు, తన నిజరూపం తెలుస్తుందని భీముడు వెరుస్తున్నారు. సవ్వడి నర్తనశాల దాటిపోకుండా, ముసుగులో గుద్దులాట భీకరంగా సాగుతోంది. పరస్పరం పిడికిలి పోట్లు పొడుచుకుంటున్నారు. సింహబలునికిది వూహించని దెబ్బ. భీముడు వ్యూహం పన్ని సంసిద్ధుడై వచ్చినవాడు.

Comments
Post a Comment