అక్కడ..రూ.100కే మూడు కిలోల చికెన్‌...

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే...ప్రపంచవ్యాప్తంగా 4240 మంది కరోనాతో చనిపోగా.... చైనాలో 3136 మంది చనిపోయారు..ఇంకా వేల మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటలీలో ఒక్కరోజులో 168 మంది చనిపోగా..మొత్తంగా 680 మంది మరణించారు. దక్షిణ కొరియాలో 58, ఇరాన్లో 271 మంది కరోనాతో చనిపోయారు. ఇక భారత్లో ఇప్పటివరకు 57 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా..ఈ కరోనాతో ముఖ్యంగా పౌల్ర్టీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. కరోనా నేపథ్యంలో చికెన్అమ్మకాలు భారీగా పడిపోగా.. చిత్తూరు జిల్లా కలికిరిలో రూ.100కే మూడు కిలోల చికెన్ను షాపుల్లోనే ఇస్తున్నారు. 2 నెలల కింద రూ.200పైగా ఉన్న చికెన్ ధరలు...ఇప్పుడ మరీ దారుణ స్థాయికి పడిపోయాయి.

రోజుకు 10 కేజీల చికెన్అ మ్మడం కూడా కష్టంగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. అటు కర్నూల్జిల్లా గూడూరు పంచాయతీలోనూ రూ.40కే కిలో చికెన్ఇస్తుండగా...చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితికి ముఖ్య కారణం.. చికెన్తింటే కరోనా వస్తుందనే అపోహే.

Comments